'నీట్'లో సత్తా చాటిన గిరిజన విద్యార్థికి ఆర్థిక సాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్ కష్టపడి చదివి NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు దక్కించుకున్నారు. మంగళవారంలోపు రూ.1.20 లక్షల ఫీజు చెల్లించాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న భద్రాచలం ITDA పీవో బీ.రాహుల్ వెంటనే స్పందించారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన రూ.60 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి వైద్యుడిగా ఎదగాలని పీవో ఆకాంక్షించగా, సంతోష్‌కు మరింత సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.