లండన్ వీధుల్లో మహీంద్రా ఆటో: నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రిపోర్టర్: మహేష్
స్థలం: London
బ్రిటన్ రాజధాని లండన్ వీధుల్లో భారతీయ ఆటోరిక్షా సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇది తమ కంపెనీకి చెందిన త్రిచక్ర వాహనమేనని ఆయన తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని, రివర్స్ కాలనిలైజేషన్ అంటూ సరదాగా జోకులు పేలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.