యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు ఒక్కరోజే రూ. 26 లక్షల భారీ ఆదాయం
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం ఒక్కరోజే రూ. 26,05,398 నికర ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,24,150, బ్రేక్ దర్శనాలతో రూ. 3,58,200, విఐపి దర్శనాలతో రూ. 4,47,600, కార్ పార్కింగ్ ద్వారా రూ. 2,37,500 మరియు ప్రసాద విక్రయాల ద్వారా రూ. 8,51,760 ఆదాయం లభించిందని అధికారులు ఒక ప్రకటనలో అధికారికంగా స్పష్టం చేశారు.