గంజాయి కేసులో సమాచారం ఇచ్చాడన్న అక్కసుతో స్నేహితుడిని హత్య చేసిన వైనం

రిపోర్టర్: మహేష్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ పరిధిలోని ఉప్పర్పల్లిలో తీవ్ర కలకలం రేగింది. గంజాయి కేసులో పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో నషీరుద్దీన్ అనే యువకుడిని అతని స్నేహితులు షోహెబ్, ఇలియాస్లు పొట్టనబెట్టుకున్నారు. హ్యాపీహోమ్స్ టవర్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్ వెల్లడించారు.