శంకరన్న పాత్ర చేయమన్నప్పుడు భయం వేసిందన్న నటుడు ప్రియదర్శి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

ది ప్యారడైజ్ చిత్రంలో శంకరన్న పాత్ర చేయమన్నప్పుడు తనకు ఎంతో భయం వేసిందని ప్రముఖ నటుడు ప్రియదర్శి వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర పోషించారు. సక్సెస్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, ఆ పాత్ర కోసం తాను చేసిన కష్టాన్ని, రీసెర్చ్ వివరాలను పంచుకున్నారు. శంకరన్న వేసుకునే బట్టలు అబిడ్స్ లో కొన్నామని, చెప్పులు, వాచ్ వంటి ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు.