గ్రూప్ వన్ ఉద్యోగాల విక్రయంపై జగన్‌ను నిలదీసిన వంగలపూడి అనిత

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

వైసీపీ హయాంలో గ్రూప్ వన్ ఉద్యోగాలను పప్పుబెల్లాల్లా అమ్మేసి రూ.150 కోట్లు కొట్టేసింది నిజం కాదా అంటూ మాజీ సీఎం జగన్‌ను మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా నిలదీశారు. కోర్టు మొట్టికాయలు వేసినా మెగా డీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె మండిపడ్డారు.