భార్యపై అనుమానంతో అత్తను హత్య చేసిన భర్త

రిపోర్టర్: హరి స్థలం: ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. లారీ డ్రైవర్ వసంతరాయుడు తన సోదరుడు అనిల్తో కలిసి భార్య నారాయణమ్మతో పాటు అత్త బ్రహ్మేశ్వరిపై అర్ధరాత్రి దాడి చేసినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అత్త బ్రహ్మేశ్వరి అక్కడికక్కడే మృతి చెందిందని, కొన ఊపిరితో ఉన్న నారాయణమ్మను నరసరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.