ఉప్పాడ తీరంలో రక్షణ గోడ డిజైన్ పనులు షురూ!

రిపోర్టర్: విజయ్ స్థలం: కాకినాడ

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్, డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. ఐఐటీ-మద్రాస్ నిపుణుల బృందం సముద్ర గర్భం, తీరప్రాంతంలో సర్వే నిర్వహిస్తోంది. సముద్ర కోత ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా శాస్త్రీయ పద్ధతిలో డిజైన్లు రూపొందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.