మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు ఐఓసీకి సుప్రీంకోర్టు ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: Punjab
లింగ వివక్ష చూపుతూ ఎల్పీజీ సిలిండర్ రిఫిల్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం నిరాకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. పంజాబ్‌కు చెందిన మహిళా అభ్యర్థికి కేవలం మహిళ అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వకపోవడం ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వయస్సు రిటైర్మెంట్ దశకు చేరుకున్నందున, సుదీర్ఘ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఐఓసీని ఆదేశించింది.