కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడింది

రిపోర్టర్: రమేష్ స్థలం: వనపర్తి

వనపర్తి జిల్లా పెబ్బేరులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకస్మికంగా సబ్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం సుభాష్‌ చౌరస్తా వరకు భారీ రోడ్‌షో నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే, నేడు కాంగ్రెస్ హయాంలో కనీసం 6 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జూరాల ఆయకట్టు ప్రాంతాలు దెబ్బతింటున్నాయని, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.