రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూయార్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం త్వరలోనే ముగిసి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధభూమిలో ప్రాణనష్టం పెరుగుతున్నందున శీతాకాలం కంటే ముందే ఈ మారణహోమానికి తెరదించాలని జెలెన్‌స్కీ ఆకాంక్షించారు.