ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేత గుజ్జుల మహేష్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్లు నాయకులు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్థానిక రాజకీయ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది.