పెదకాకాని ఆలయంలో మంగళసూత్రం కలకలం, టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత!
రిపోర్టర్: కిరణ్
స్థలం: పల్నాడు
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో నిందితుడు రణధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయం రగులుకుంది. అమ్మవారికి నాంతాడు సమర్పించేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఆలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఇరువర్గాల మధ్య పరస్పర విమర్శలు, సంచలన వ్యాఖ్యలు చేసుకున్నారు.