నీట్ ఫలితాలలో ప్రతిభ చాటి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థినులు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: రామభద్రపురం
విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్ వ్యూ స్కూల్ విద్యార్థినులు జాతీయ స్థాయి నీట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. 2023-24 పదో తరగతి సీబీఎస్ఈ బ్యాచ్ విద్యార్థిని ఎం. సోనాలి ఆంధ్ర మెడికల్ కాలేజీలో, బొబ్బిలి మల్లమ్మపేటకు చెందిన పి. నిమీష పాడేరు మెడికల్ కాలేజీలో సీట్లు దక్కించుకున్నారు. విద్యార్థుల ఘనతపై పాఠశాల చైర్మన్ పోల వెంకట రమణ, కరస్పాండెంట్ పోల చంద్రమోహన్, ప్రిన్సిపాల్ సంధ్య హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.