స్థానిక ఎన్నికల వేళ షెడ్యూల్ మార్పు: ఏపీలో నవంబర్ 5న ఎంపీటీసీ పోలింగ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సవరించినట్లు వెల్లడించారు. పోలీసు సిబ్బంది కొరత కారణంగా నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్ ను నవంబర్ 5వ తేదీకి మారుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే నవంబర్ 7న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని, అవసరమైన చోట నవంబర్ 6న రీపోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.