'రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కలకలం': ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఘోర హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ఈ కేసులో అరెస్టయ్యాడు. కండిషన్ బెయిల్‌పై ఉన్న సందీప్ గంజాయి సేవిస్తున్న వీడియోలు బయటపడటం సంచలనంగా మారింది.