సాకేత్ షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరికి గాయాలు, ఆరు కార్లు దగ్ధం
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
న్యూఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఉన్న కియా కార్ల షో రూమ్ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని డిప్యూటీ మేజిస్ట్రేట్ లక్ష్య సింఘాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న పన్నెండు మందిని సురక్షితంగా రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు.