సమ్మర్ హాలిడేస్ చిత్రం: నవంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశంతో తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ సినిమా నవంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం పిల్లల సినిమా మాత్రమే కాదని, పెద్దలకు తమ బాల్యాన్ని గుర్తుచేసే అద్భుతమైన కుటుంబ కథా చిత్రమని స్పష్టం చేశారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహించారు.