కేసముద్రంలో వినాయక మండపం వద్ద హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

రిపోర్టర్: రాము స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో టీమ్ గణనాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మండపంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, అందులోని నగదు తీసుకుని వినాయకుడి విగ్రహం వద్ద రూ.116 పెట్టి వెళ్లారు. ఉదయం గమనించిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.