పల్లె పండుగ సభ విజయవంతంపై ఆనం రామనారాయణ రెడ్డి కృతజ్ఞతలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె పండుగ మూడు గంటల బహిరంగ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కష్టపడి పని చేసిన కార్యకర్తలకు మరియు ఎంతో సమన్వయంతో వ్యవహరించిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా ప్రశంసించారు.