ఫరీదాబాద్‌లో హిట్ అండ్ రన్ ఘటనపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: హరియాణా
హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఆలయం నుంచి వస్తున్న లక్ష్మీ నారాయణ్ ఝన్వర్ అనే వ్యక్తిని కారుతో డీ కొట్టి చంపిన ఘటనలో నెల రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆయన కుమారుడు అమిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 27న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో సీసీటీవీ పుటేజ్ ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, కారులో ఉన్నవారందరినీ గుర్తించి కఠిన శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే పూర్తి దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు.