అక్టోబర్ 9న వెంకటేష్ ఆదర్శకుటుంబం సినిమా విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం ఏకే 47 సినిమా విడుదల తేదీని మేకర్స్ మార్చారు. ముందుగా అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా అక్టోబర్ 9కి వాయిదా వేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావురమేశ్, సత్య కీలకపాత్రలు పోషిస్తున్నారు.