కృష్ణపట్నం పోర్టుకు అరుదైన గౌరవం: పదిహేను అవార్డులు కైవసం చేసుకున్న వైనం

రిపోర్టర్: రమేష్ స్థలం: సర్వేపల్లి

క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పన్నెండో వార్షిక కన్వెన్షన్లో అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ పదిహేను అవార్డులను గెలుచుకున్నట్లు సీఈఓ జగదీష్ పటేల్ వెల్లడించారు. కార్యాచరణ నైపుణ్యం, నాణ్యమైన సంస్కృతి, స్థిరమైన వ్యాపార పరివర్తనలో అత్యుత్తమ కృషికి గుర్తింపుగా సంస్థకు ఉత్తమ పరివర్తన అవార్డు దక్కిందని తెలిపారు. ఈ కన్వెన్షన్లో తొమ్మిది బంగారు, ఒక వెండి పతకంతో పాటు పలు వ్యక్తిగత పురస్కారాలు లభించాయని, ఇది ఉద్యోగుల సమష్టి కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.