వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: నేటి నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
వైద్య విద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆల్ ఇండియా కోటా సీట్లతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వర్సిటీలలో ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.