కాంగ్రెస్ సర్కార్ తీరుపై దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్

రిపోర్టర్: రమేష్ స్థలం: Nalgonda

నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఏ పల్లి మండలం నక్కలపెంట తండాకు చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు.