దసరా కానుకగా నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు దసరా పండుగ కానుకగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపుల తర్వాత కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామక ప్రక్రియపై తుది నిర్ణయం వెలువడనుంది. సీనియర్లతో పాటు సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేయనున్నారు.