జయపురంలో మహిళను హత్య చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టిన ప్రియుడు
రిపోర్టర్: మహేష్
స్థలం: జయపూర్
రాజస్థాన్ రాష్ట్రం జయపురంలోని బిందాయక ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. ముప్పై రెండేళ్ల కిరణ్ అనే మహిళను ఆమె సహజీవన భాగస్వామి ప్రవేశ్ అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఇంటి పెరట్లో పూడ్చిపెట్టి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అద్దె ఇంటికి తాళం వేసి ఉండటం, పెరట్లో అనుమానాస్పదంగా మట్టి తొలగించి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని భూమిలో నుంచి బయటకు వస్తున్న మహిళ చేతిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.