జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్ల గుట్టు రట్టు, ఐదుగురి అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విస్తృత తనిఖీలు నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 880 ట్రెమడాల్ మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.