రాష్ట్రంలో వివిధ రంగాల్లో 23 ప్రత్యేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామన్న లోకేష్

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో రెండేళ్లలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చామని తెలుగు దేశం పార్టీ పేర్కొంది. స్పేస్, డ్రోన్లు, సిమెంట్, స్టీల్, ఫార్మా, ఏఐ, డేటా రంగాలతో పాటు హార్టికల్చర్, ఆక్వా రంగాలను కలుపుకుని మొత్తం 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు పీఏఎఫ్ఐ వార్షిక వేదికలో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసినట్లు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతా వెల్లడించింది.