నాతవరం మండలంలో ఘనంగా అంగన్వాడి ఆధ్వర్యంలో పోషణ మాసం ఉత్సవాలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాతవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని వైవి అగ్రహారం పంచాయతీలో అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె. విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఉమామహేశ్వరి, విజయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.