భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయకుని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వఖిల్ పేటలో వినాయకునికి అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉభయదాతలుగా చెప్తా శివకుమార్, నిర్మల దంపతులతో పాటు పిట్ట శంకరయ్య, శ్యామల వ్యవహరించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరై వినాయకుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.