హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పదిహేను నిమిషాలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ నాలుగు వద్ద విజయవంతంగా పూర్తయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ ఉడుముల తెలిపారు. అంతకుముందు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన అట్టహాసమైన అరవై తొమ్మిది అడుగుల ఎత్తైన భారీ విగ్రహ శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ భక్తుల జైశ్రీరామ్ నినాదాల నడుమ నిమజ్జన ప్రాంతానికి చేరుకుంది.