తల్లిదండ్రులను ప్రశ్నించిన వ్యక్తిపై కత్తితో దాడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదమధుపాడలో దారుణం చోటుచేసుకుంది. మత్తు పదార్థాలకు బానిసైన విజయ్‌కుమార్ తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. డబ్బుల కోసం వేధిస్తుండగా అడ్డుకున్న పొరిగింటి వ్యక్తి దారపురెడ్డి కృష్ణపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.