నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్లో గంజాయి కలకలం: తమిళనాడు వాసి అరెస్ట్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న తమిళనాడుకు చెందిన జయశీలన్ అనే వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా, రెండు ప్యాకెట్లలో ఉన్న ఆరు కిలోల గంజాయితో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని సీలేరులో కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.