కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం, ప్రజలు అప్రమత్తం
రిపోర్టర్: రమేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఏలేశ్వరం సెక్షన్ పరిధిలోని పెద్దిపాలెం బీట్లోకి పెద్దపులి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను రేడియో కాలర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఇళ్లలోనే ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ధారపల్లి జలపాతం వైపు పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.