ఓటర్ల జాబితా సవరణలో కీలక మార్పులు: ఫారమ్-7 దరఖాస్తులపై ఈసీఐ పరిమితులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఉపయోగించే ఫారమ్-7 దరఖాస్తులపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఒక వ్యక్తి గరిష్టంగా పది మాత్రమే దాఖలు చేసేలా నిబంధనలు కఠినతరం చేసినట్లు స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలతో ఓట్లు తొలగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈఆర్ఓలను ఈసీఐ ఆదేశించింది.