ఒక్కరే విద్యార్థి ఉన్న పాఠశాలలో ఎస్ఎంసీ ఛైర్మన్గా తండ్రి ఎన్నిక
రిపోర్టర్: సురేష్
స్థలం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఆ బడిలో రెండో తరగతి చదువుతున్న ఈతకోట నతన్తేజ్ ఒక్కడే విద్యార్థి కాగా, సూర్యప్రకాశరావు ఒక్కరే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలకు ఆ బాలుడి తండ్రి దేవీవరప్రసాద్ ఒక్కరే హాజరు కావడంతో, ఆయనను ఏకగ్రీవంగా ఎస్ఎంసీ ఛైర్మన్గా ఎంపిక చేసి అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.