గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పోలీసుల కఠిన నిబంధనలు

రిపోర్టర్: హరి స్థలం: బాలానగర్

ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్‌రెడ్డి కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 200 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు శోభాయాత్ర ప్రారంభించి, డీజేల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, చెరువుల్లోకి దిగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.