టిఫిన్ లో మెంతికూర తెచ్చినందుకు విద్యార్థికి జరిమానా విధించిన పాఠశాల

రిపోర్టర్: హరి స్థలం: థానే

మహారాష్ట్రలోని థానే జిల్లా భాయందర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జైనుల పవిత్ర పండుగ పర్యుషన్ సందర్భంగా విద్యార్థి టిఫిన్ బాక్సులో మెంతికూర వంటకం తెచ్చినందుకు యాజమాన్యం రూ.50 జరిమానా విధించింది. పాఠశాలలో ఎక్కువ మంది జైన్ విద్యార్థులు ఉన్నారనే కారణంతో ఆకుకూరలు తీసుకురావద్దని నిబంధన పెట్టిన స్కూల్ యాజమాన్యం, విద్యార్థికి క్యాంటీన్ ఆహారం అందించే పేరుతో ఈ ఫైన్ వసూలు చేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో ఎంబీఎంసీ విద్యాశాఖ స్పందించి పాఠశాలకు షోకాజు నోటీసులు జారీ చేసింది.