పులివెందులలో జగన్ విధ్వంసం: తెదేపా నేత బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: పులివెందుల

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటేయడానికి వచ్చి విధ్వంసం సృష్టించారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పులివెందుల నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మారెడ్డి రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పురపాలక కార్యాలయం వద్ద తెదేపా నేతలతో కలిసి ఆయన బైఠాయించారు. వైకాపా మూకల దాడిలో తమ కార్యకర్తకు గాయాలయ్యాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.