మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఐదు రోజుల సిట్ కస్టడీ పిటిషన్
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
మద్యం రవాణా టెండర్ల గోల్‌మాల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ పరిధిలో జరిగిన టెండర్ల అక్రమాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా, దీనిని సవాలు చేసేందుకు ఆయన న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.