వైభవంగా తిరుమలేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తిరుపతిలో విద్యుత్ కాంతులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుమలేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వినాయక చవితి పర్వదినం వేళ తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తితిదే అధికారుల ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా వీధిదీపాలకు మరమ్మతులు చేపట్టి, ప్రధాన రహదారులు, కూడళ్లలో స్వామివారి రూపాలతో ఆకర్షణీయమైన విద్యుత్ దీపాల అలంకరణలు చేశారు. కనుమదారి నుంచి చూస్తే నగరం సర్వాంగ సుందరంగా కాంతులీనుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.