ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోళ్లపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ ఆరోపణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.