హైదరాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ రెండవ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పర్యటించనున్నట్లు అధికారిక షెడ్యూల్ విడుదలైందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి నిజాం కాలేజ్ సమీపంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఎంజే మార్కెట్ కూడలి వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగించి, బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారని వెల్లడించారు.