సంఘీభావం చాటుతూ రెడ్ల ఐక్యవేదిక సభ్యుల జన్మదిన వేడుకలు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు

నెల్లూరు శాంతినగర్లోని నిర్మల సౌధలో రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు సంస్థ నెలవారీ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ నెలలో పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆరుగురు శాశ్వత సభ్యుల వేడుకలను కేకు కోసి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. నూతనంగా శాశ్వత సభ్యత్వం స్వీకరించిన అమ్మ ఫర్నిచర్స్ అధినేత గడ్డం సుజన్ రెడ్డిని సభ్యులందరూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షులు నరసింహా రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.