విశాఖలో లాడ్జ్లపై మెరుపు దాడులు: అక్రమ రవాణా నిరోధానికి పోలీసుల ముమ్మర తనిఖీలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు నగరంలో లాడ్జ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించిన లాడ్జ్ నిర్వాహకులపై కఠిన కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.