పైడితల్లి సిరిమానోత్సవం: విజయనగరం నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు జారీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
పైడితల్లి సిరిమానోత్సవం నేపథ్యంలో విజయనగరం నగరంలో సోమ, మంగళవారాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విశాఖపట్నం రేంజ్ ఐజీ పి.గోపీనాథ్ జట్టి తెలిపారు. నగరంలోకి వేల సంఖ్యలో వాహనాలు రానున్నందున కొన్ని ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామని, భక్తులు పోలీసులకి సహకరించాలని అధికారులు కోరారు. బందోబస్తు కోసం మూడు వేల ఐదు వందల మంది పోలీసులను రంగంలోకి దించామన్నారు.