మహారాష్ట్ర నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో 550 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో నీట్ యూజీ 2026 ప్రవేశాల ప్రక్రియలో భాగంగా సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ రౌండ్ 2 కోసం మూడు ప్రైవేట్ వైద్య సంస్థల్లో 550 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర సెట్ సెల్ ముంబై కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 40 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు, మిగతా 60 శాతం ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు.