విశాఖపట్నం పోర్టులో భారీ అగ్నిప్రమాదం: దట్టమైన పొగలతో ఉలిక్కిపడ్డ ప్రాంతం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. సీ హార్స్ జంక్షన్ సమీపంలోని జె.ఎం. భక్షి కంపెనీ పరిధిలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు భారీగా ఎగసిపడటంతో పోర్ట్ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.