ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎన్. రామచందర్ రావు పోటీ ఖాయమేనా?

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. 2027 మార్చితో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత ఎన్. రామచందర్ రావును బరిలోకి దించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. పట్టభద్రుల్లో బలమైన పట్టున్న రామచందర్ రావు అభ్యర్థిత్వంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ స్థానాన్ని దక్కించుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ సత్తా చాటాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.